![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEigCKJN8EkdJ5w0OUj2dtThKTcUcq72CvPuH_njJ-56LQzHNIGElHaPZyHFx6P3tBtSuz0a52YB69hP9YYw3Tt2ig8F-0iZ-sCngM9Q39XPZlWIURiO69BHVe1VM5mXBQEtyiZdpN2Zr89J/s320/mahatma-gandhi1.jpg)
ప. ముసలివారినిచూసి మూల్గుటెందులకు
యౌవ్వనమ్మనునది యెన్నాళ్లు నిలచు
1. వృద్ధాప్యమనునది వూడిగము కారాదు
శాంతిసౌఖ్యములతో హాయిగనుండవలె
ముసలివారినిచూసి మమకారమేచూపి
మనసు రంజిల్లెడి మాటలాడగవలె
2. వృద్ధులును ఒకనాటి యువకులేసుమ్మీ
అనుభవము పొందిరి అన్ని రంగముల
పిల్లలను పాపలను ఆప్యాయతలతోడ
మంచి పౌరులుగ మలచిన ఘనులు
3. తనయుడే తండ్రి తండ్రియే తాత
కాలగమనమెమనకు కనువిందుచేయు
యెల్లపుడు ఆనందమందుచును మనుజుడు
దేశప్రగతికి పాటు పడుచునుండగవలె
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం smkodav@gmail.com
Phones: 0891 2740744, 0891 2547027, 9989719027
http://senior789.blogspot.com
=====================================
ఆనందభైరవి...మిశ్రచాపు తాళం..
ప. ముసలి ముసలియని కసరుట యెందుకు
కనికరమే లేదాయే
కనికరమే లేదాయే
1. ముదుసలి యనినచొ యెవ్వరనుకొంటివి
మమతానురాగాల మహనీయ మూర్తి
మమత నిండిన మనసుతోడ
మార్గదర్శిగ నిలచె మనకు
ఆదరమ్ము చూపినంతనె
ఆప్యాయత నిండునతనిలో
2. వున్నదంతయు మనకు వూడ్చి పెట్టె నతడు
వంశాభివృద్ధికి పాటుపడెనెంతగానొ
ధనముతోడుత కొనగలేనిది
దయాగుణమున దక్కు మనకు
ఆప్యాయత మెండుగాగల
ఆత్మ బంధుడె అతడె మనకు
======================================
డెబ్బదిలో దేహం
ప. దినకరుడు పడమటకు ఒరిగెనే చిలుక
దినదినము ఒక యుగమ్మాయెనే చిలుక
1. డెబ్బది పదులలో దేహమే చిలుక
అబ్బబ్బ జబ్బులే దాపురించేనె చిలుక
ముప్పతిప్పలు పెట్టు మధుమేహమే చిలుక
రచ్చకీడ్చుచునుండె రక్తపోటే చిలుక
2. కట్టకట్టల కఫము నోట కారెనె చిలుక
చుట్టుకొని పోతినే మంచాన చిలుక
చుట్టాలు పక్కాలు చూడవచ్చిరె చిలుక
కట్టుకొన్నది నా పక్కనున్నదె చిలుక
3. వైద్యుడే వడలంత కెలికెనే చిలుక
ఉప్పు పులుపు తీపి వలదనెనె చిలుక
మసాలా కారములు మానమనెనే చిలుక
మితముగ మందులను వాడమనెనే చిలుక
4. సైంధవ లవణమే శరణమనెనే చిలుక
తేనె వుసిరిక శొంఠి దివ్యౌషధమె చిలుక
శాకాహారమే శ్రేయమ్మనెనే చిలుక
యోగమార్గమ్మెంతొ యోగ్యమనెనే చిలుక
శాంతితో జీవితము సౌఖ్యమనెనే చిలుక
===========================================
===========================================
సంధ్యా కిరణాలు
ప. సంధ్యా కిరణాలు శాంతి కిరణాలు
సంధ్యా జీవుల సంస్కార కిరణాలు
1. వృద్ధ జనులను వుద్ధరించు కిరణాలు
వృద్ధజనుల వ్యధ తీర్చు కిరణాలు
మధురభావాల మైత్రి కిరణాలు
అదృష్టమైన హాయి కిరణాలు
2. మనో ధైర్యము గొల్పు మేటి కిరణాలు
వన్నెలే తరుగని వజ్రంపు కిరణాలు
చిన్నతనమే లేని చైతన్య కిరణాలు
అన్నదమ్ములవలే అలరారు కిరణాలు
3. మలి సంధ్యలో మేల్కోల్పు కిరణాలు
కలి ప్రభావము లేని కాంతి కిరణాలు
వాలి బలము గల వన్నెగల కిరణాలు
గాలి ధూళి లేని గొప్ప కిరణాలు
4. చతురత గలిగిన స్నేహ కిరణాలు
హితుల స్నేహితుల చేయు కిరణాలు
అతులిత సామర్ధ్య ఆనంద కిరణాలు
కాంతి వెదజల్లెడు కరుణ రస కిరణాలు
యవ్వనము వెనుక వార్ధక్యమేగదా
ప. ఎవ్వరికైనను తప్పని స్థితి గదా
యౌవ్వనము వెనుక వార్ధక్యమే గదా
1. పుట్టినప్పుడు మనిషి పురిటికందే గదా
అట్టట్టె పెరుగు చూచుచూనుండగనె
చుట్టుముట్టుచునుండు కష్టసుఖములు యెన్నో
చట్టుమని వార్ధక్య ఛాయాలే కమ్ము
2. బాల్య యౌవ్వనములు బాగుగా సాగినను
ముదిమి వయసున జవసత్వములు సడలును
మెల్లమెల్లగ వడలు కృసియింప సాగును
అంతటనె ఆసరా అత్యవసరమ్మగును
3. దుర్వ్యసనమ్ములకు బానిస గాకున్న
దుష్టులతో గూడి భ్రష్టు గాకున్న అ
దృష్ట దేవతయె ఆతనిని వరియించు
ఇష్టులతో కూడి హాయిగానుండు
4. ఆరోగ్యమేగదా మహాభాగ్యమ్మనిరి
ఆనందమేగదా ఆయువును పెంచు
ఆయురారోగ్య ఐశ్వర్యములు గలుగ
శత వత్సరమ్ములు శాంతితో జీవించు
ధన్యుడు మాన్యుడు ధరలో అతడు
రచన ,సంగీతం , గానం : కోడవంటి సుబ్రహ్మణ్యం ======================================
స్నేహ సంధ్య
ప. స్నేహ సంధ్యలో సేద తీరుచు హితులమైతిమి అందరము
స్నేహితులమైతిమి అందరము సన్నిహితులమైతిమి అందరము
అందరము మనమందరము ఆనందముగా అందరము
1. రాజు పేదను భేదమె తెలియక వున్నదానితో తృప్తిని పొందుచు
సన్నిహితులకు సహాయపడుచు చింతలేవియు చెంత చేరకనె
సహనమునే పాటించెదము శుభములనే కాంక్షించెదము
2. మానవ సేవయె మాధవసేవ మానవ సేవయె మనసుకు శాంతి
అన్నదానమే అన్నిటమిన్న అన్ని దానములు దయాగుణములే
దయగలవారే దానకర్ణులు దయగలవారికి దాసోహమ్ము
3.ముదిమివయసు మనకంటకుండగ
మనసునంతటిని శాంతపరచుకొని
అంతరమంతయు హాయిని నింపి
ప్రగతిపథాన పయనమునందుచు
దేశమునే ప్రేమించెదముదము
లోక శాంతినే కోరెదము
దేశమును ప్రేమించుమన్నా
మంచియనునది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్(గురజాడ 1910)
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు.. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
రచన ,సంగీతం , గానం : కోడవంటి సుబ్రహ్మణ్యం
సంధ్యా సమయపు సహచరులు
ప. సంధ్యా సమయపు సహచరులందరు
స్నేహ సంధ్యలో స్నేహితులైనారు
1. సాయంకాలపు చల్లని వేళల
సంధ్యానిలయము విందులు చేయగ
అరుదెంచిరి ఆత్మీయులందరును
హాయి గొలిపె ఆనందము పొంగె
2. మాటల మించిన మనసు గల వారు
సుమనస్కులు సువిశాల హృదయులు
పండుటాకులా కాదు పరువములు
నిండు యౌవ్వనులు వినూత్న రత్నములు
3. వింధ్య హిమాచల యమునా గంగ
ఉత్తుంగ తరంగ సేవా దురంధరులు
మలి సంధ్యలోని మాణిక్యములు
అందరి మన్ననలనందుకొనువారు
రచన ,సంగీతం , గానం : కోడవంటి సుబ్రహ్మణ్యం smkodav@gmail.com
Phones: 0891 2740744, 0891 2547027, 9989719027
http://senior789.blogspot.com
http://amrutam7.blogspot.com/
Fantastic Sri KS garu. One is young always - may be experience differs.
ReplyDelete